Nizamabad: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న వరద.. 26 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్యుల నీరు విడుదల

Nizamabad: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా శ్రీరామ్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది.

Update: 2025-10-31 06:04 GMT

Nizamabad: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా శ్రీరామ్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి లక్ష తొమ్మిది వేల క్యూసెక్యుల వరద కొనసాగుతుంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 26 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్యుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.

కాలువల ద్వారా తొమ్మిది వేల క్యూసెక్యుల వరద నీరుని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1లక్ష 9వేల 654 క్యూసెక్కులు ఉండగా...ఔట్‌ ఫ్లో 1లక్ష 9వేల 654 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం వెయ్యి 91 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి నిలువ 80 వేల 501 టీఎంసీలుగా ఉంది.

Full View

Tags:    

Similar News