Srinivas Goud: మహబూబ్ నగర్ జిల్లా కొత్త గంజి ఈద్గాలో సామూహిక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud:ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు
Srinivas Goud: మహబూబ్ నగర్ జిల్లా కొత్త గంజి ఈద్గాలో సామూహిక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud: ముస్లీం సోదరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్త గంజి ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్‌ను త్యాగాలకు ప్రతీకగా జరుపుకుంటామని మంత్రి తెలిపారు. వ్యక్తిగంతంగా కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినపుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ ఇస్తుందన్నారు. బక్రీద్ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని శ్రీనివాస్ గూడ్ తెలిపారు.