Sridhar Babu: బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుంది
Sridhar Babu: రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాం
Sridhar Babu: బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుంది
Sridhar Babu: బీఆర్ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్ అయ్యారు. ఓడిపోయినా బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలిలో మార్పు లేదని ఆయన మండిపడ్డారు. నియంతృత్వ ధోరణితోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ 420 పేరుతో బుక్ రిలీజ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు శ్రీధర్‌బాబు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై బీఆర్ఎస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒక హామీని నెరవేరుస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.