SP Helped to Orphans in Telangana: అనాధలకు పోలీసు అధికారి సహాయం

SP Helped to Orphans in Telangana: బయటకు కఠినంగా కనిపించే పోలీసుల్లో మానవత్తం ఉందని నిరూపించారు ఎస్పీ రాహూల్ దేవ్ హెగ్డే.

Update: 2020-07-07 03:05 GMT
SP Helped to Orphans in Telangana

SP Helped to Orphans in Telangana: బయటకు కఠినంగా కనిపించే పోలీసుల్లో మానవత్తం ఉందని నిరూపించారు ఎస్పీ రాహూల్ దేవ్ హెగ్డే. తల్లిదండ్రులకు దూరమయిన అనాధలకు సాయం చేసి హెట్సాప్ అనిపించుకున్నారు. పోలీసులంటే ప్ర‌జ‌ల్లో స‌దాభిప్రాయం చాలా త‌క్కువ‌. కొంద‌రు ఆఫీస‌ర్లు మంచి వారు ఉన్నా… కొంద‌రి మాట దురుసు, ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రికీ అదే మ‌కిలీ అంటుకుంది. కానీ  తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎస్పీ చేసిన ప‌ని చూస్తే నిజంగా స‌లాం కొట్టాల్సిందే. ఫ్రెండ్లీ పోలీస్ మాట‌ల‌కు అస‌లైన అర్థం ఇదే అనిపిస్తుంది.

ఆప‌ద స‌మ‌యంలో స‌హయం చేయ‌టంలో ముందుంటారని పేరున్న ఎస్పీ రాహుల్ హెగ్డే త‌న ప్ర‌త్యేక‌తను మ‌రోసారి చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ పద్మ దంపతులు అనారోగ్యంతో మృతి చెందగా వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఆ చిన్నారుల బంధువులు ఎవరు కూడా వారి మీద భారం పడుతుందో ఏమో అని ఆ పిల్లలను దగ్గరకు రానివ్వలేదు. మండల కేంద్రానికి సమీపంలో ఆ పిల్లల అమ్మమ్మ ఉండటంతో ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. కానీ ఇటీవల ఆ వృద్ధురాలు అనారోగ్యంగా ఉండటంతో దీంతో ఆ పిల్లలిద్దరి పరిస్థితి దయనీయంగా మారింది.

సిబ్బంది ద్వారా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వారికి ముందుగా వారికి సొంతిల్లు ఉండాలన్న ఆలోచ‌న‌తో ఒక స్థలం సేకరించి పోలీసుల ఆధ్వర్యంలో ఒక ఇంటిని నిర్మించి ఇచ్చి రెండు రోజుల క్రితం గృహప్రవేశం చేశారు. అంతేకాదు ఆ చిన్నారుల ఖర్చుల నిమిత్తం యాభై వేల‌ రూపాయల చెక్ ని ఇచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలోసహాయం వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన జిల్లా ప్రజలు సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే చేసిన సహాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News