Somu Veerraju: చంద్రబాబు ద్వందవైఖరి ఖండించిన సోము వీర్రాజు
Somu Veerraju: చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్
Somu Veerraju: చంద్రబాబు ద్వందవైఖరి ఖండించిన సోము వీర్రాజు
Somu Veerraju: టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ద్వందవైఖరిని ఆయన వీర్రాజు ఖండించారు. రాష్ట్రంలో సిబిఐ తిరగకూడదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేయకూడదంటూ గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వ సంస్థలను బిజెపి ప్రభుత్వం ఇవ్వడం లేదని ఎలా ప్రశ్నిస్తారని అడిగారు వీర్రాజు... దీనిపై చంద్రబాబు చర్చకు సిద్ధమేనా అని వీర్రాజు సవాల్ విసిరారు. చంద్రబాబే ప్రత్యేకహోదా అవసరం లేదని చెప్పారని అన్నారు. చంద్ర బాబు సభలు ఏపీలో పెడుతుంటే ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేంద్రంపై అభాండాలు వేస్తే సహించబోమమని, చంద్ర బాబు గురించి చాలా విషయాలు బయట పెడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్ర బాబు ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారని, తమ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు సోము వీర్రాజు... చంద్రబాబు అధికారంలో ఉండగా... కేంద్ర హోమంత్రిపై దాడి చేస్తే... అడ్డు ఉన్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని అన్నారు... చంద్రబాబు గతంలో కేంద్రంలో చక్రం తిప్పారు కదా అని, ఐదుగురు ప్రధానులను మార్చారని అంటారు... కదా.. అని, అలాంటి చంద్రబాబుకు ఆనాడు రైల్వే జోన్ ఇవ్వడం వెంట్రుకతో సమానమని, ఎందుకు ఏపీకి రైల్వే జోన్ తెచ్చుకోలేకపోయారని వీర్రాజు ప్రశ్నించారు. ఈ విషయంపై చంద్రబాబును రమ్మనండి ఆయన్నే అడుగుతానన్నారు సోము వీర్రాజు.