ఎస్‌ఎల్ బీసీ టన్నెల్ పనుల్లో ప్రమాదం: ఏడుగురు కార్మికులకు గాయాలు
SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ ఎల్ బీ సీ పనులలో 3 మీటర్ల వద్ద పైకప్పు పడిపోయింది.
ఎస్‌ఎల్ బీసీ టన్నెల్ పనుల్లో ప్రమాదం: ఏడుగురు కార్మికులకు గాయాలు
SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ ఎల్ బీ సీ పనులలో 3 మీటర్ల వద్ద పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర వద్ద ఈ ఘటన జరిగింది. ఎస్ఎల్ బీ సీ ప్రాజెక్టు పనులను నాలుగు రోజుల క్రితం ప్రారంభించారు.ఇవాళ సుమారు 50 మంది కార్మికులు సొరంగం పనులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో టన్నెల్ పై భాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.
సహాయక చర్యలకు రేవంత్ ఆదేశం
ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు., సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులు వెళ్లాలని ఆయన ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లో బయలుదేరారు. మరో వైపు ఇప్పటికే సంఘటన స్థలానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు