ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: ఐదేళ్ల క్రితమే వార్నింగ్ ఇచ్చిన టీఎస్‌పీ రిపోర్ట్

SLBC Tunnel Collapsed: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలు ఉన్నాయని ఐదేళ్లకు ముందే నివేదిక ఒకటి వెల్లడించింది.

Update: 2025-03-06 06:56 GMT

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: ఐదేళ్ల క్రితమే వార్నింగ్ ఇచ్చిన టీఎస్‌పీ రిపోర్ట్

SLBC Tunnel Collapsed: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలు ఉన్నాయని ఐదేళ్లకు ముందే నివేదిక ఒకటి వెల్లడించింది. టన్నెల్ పనులు నిర్వహిస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ నియమించిన కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. 2025 ఫిబ్రవరి 22న టన్నెల్‌లోని 14వ కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఇంకా వారి జాడ ఇంకా తెలియరాలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పనుల నిర్మాణానికి నోయిడాకు చెందిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది.

టన్నెల్ సీస్మిక్ ప్రీడిక్షన్ టీఎస్ పీ పేరుతో 303 పేజీల నివేదికను అంబెర్గ్ టెక్ ఏజీ అనే కంపెనీ 2020లో ఈ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారంగా టన్నెల్ తవ్వే మార్గంలోని 13.88 కి.మీ.నుంచి 13.91 కి.మీ.మధ్య ఫాల్ట్ జోన్ ఉందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది. ఈ ప్రాంతంలో బండరాళ్ల బలం తక్కువగా ఉంటుందని నివేదిక చెబుతోంది. ఈ నివేదిక చెబుతున్నట్టుగానే ఇటీవల జరిగిన ప్రమాదం కూడా ఇక్కడే జరిగింది. గత ఏడాదిలో కూడా ఇదే ప్రాంతంలో సొరంగం పనులు నిర్వహిస్తున్న సమయంలో నీటి ఊట ప్రారంభమైంది.దీంతో పనులు నిలిపివేశారు. పనులు ప్రారంభించిన వారం రోజులకే ఈ ప్రమాదం జరిగింది.

ఈ నివేదిక బయటకు వచ్చి ఇప్పటికి ఐదేళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు పరిస్థితుల్లో మార్పులు ఉండకపోవచ్చని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భూమిలోపల ధృడత్వంలో మార్పు ఉండదు. కానీ, భూమి నుంచి నీరు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫాల్ట్ జోన్ చుట్టూ పైకప్పు మూడు మీటర్ల వరకు కుంగిపోయిందని రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్న ఉన్నతాధికారి తెలిపారు.ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వాటర్ సీపేజీ‌తో రెస్క్యూ ఆపరేషన్స్‌‌కు ఆటంకం ఏర్పడుతోంది. సొరంగంలోని 13.5 కి.మీ తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ డెడ్ ఎండ్ లో చిక్కుకుపోయింది.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌పై 2020లో మరో నివేదిక కూడా మరో విషయం చెబుతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డీజీ మందపల్లి రాజు, జయప్రకాష్ అసోసియేట్స్ జియాలాజిస్ట్ రితురాజ్ దేశ్ ముఖ్ కమిటీ ఈ నివేదికను ఇచ్చింది. బయో టెక్నికల్ అంశాలు ఆఫ్ ఎ లాంగ్ టన్నెల్ అనే పత్రంలో పలు విషయాలు చెప్పారు. ఈ సొరంగం రిజర్వ్ ఫారెస్ట్ గుండా తవ్వాలి. బోర్ హోల్స్ లేదా డ్రిల్లింగ్ లేదా టన్నెల్ వెంట డ్రిఫ్ట్ తవ్వకం వంటి భూగర్భ పరిశోధనలు అనుమతించలేదు. జియో టెక్నికల్ డేటా లేకుండానే టన్నెల్ పనులు ప్రారంభించారని ఈ నివేదిక తెలిపింది.శ్రీశైలం ఎడమ గట్టు వద్ద ఉన్న భూగర్భ విద్యు్ కేంద్రం సొరంగాలలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా టన్నెల్ తవ్వకం ప్రారంభించారు.

Tags:    

Similar News