Bandi Sanjay: సంజయ్ ఇంటికి బయల్దేరిన సిట్ అధికారులు
Bandi Sanjay: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు
Bandi Sanjay: సంజయ్ ఇంటికి బయల్దేరిన సిట్ అధికారులు
Bandi Sanjay: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనుంది. ఇప్పటికే సంజయ్ ఇంటికి సిట్ అధికారులు బయల్దేరి వెళ్లారు. పేపర్ లీక్‌పై చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 24న బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే.. ఆ సమయంలో బండి సంజయ్ ఇంట్లో లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు అధికారులు. మరోవైపు.. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్న బండి సంజయ్.. సిట్‌పై తనకు నమ్మకం లేదని చెప్పారు. ఇప్పుడు మరోసారి బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.