భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర... చేనేత కళాకారుని అద్భుత ప్రతిభ

Sircilla: అగ్గిపెట్టేలో.. దబ్బనంలో దూరే చీరను నేసి ఖ్యాతికెక్కిన విజయ్

Update: 2024-04-17 05:44 GMT

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర... చేనేత కళాకారుని అద్భుత ప్రతిభ

Sircilla: తన తండ్రి నల్ల పరందాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు. నల్ల పరందాములు.. సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కాళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుమారుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదించారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నల్ల విజయ్ అగ్గిపెట్టెల్లో, దబ్బనంలో పట్టే చీరలను నేసి.. సిరిసిల్ల ఖ్యాతిని మరింత పెంచారు. కుట్టు లేని కుర్తా, పైజామాను, అరటి నారతో విభిన్నమైన వస్త్రాలను నేసి చేనేత కళా రత్న అవార్డును సైతం అందుకున్నారు.

రాజన్నసిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ భద్రాచల రామయ్యకు వినూత్నముగా నేసిన చీరను బహుకరించేందుకు సిద్దమయ్యాడు. నల్ల విజయ్ చేనేత మగ్గం పై భద్రాచల రామయ్యకు రంగులు మార్చే బంగారు చీరను నేసి పలువురితో అభినందనలు అందుకున్నారు. నల్ల విజయ్ కుమార్ గతంలో ఎన్నో అద్భుతాలను చేనేత మగ్గంపై నేసి సిరిసిల్లా ఖ్యాతిని నలుదిశలకు విస్తరింపజేశాడు. వారసత్వంగా వచ్చిన కళను అందిపుచ్చుకొని చేనేత మగ్గంపై సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు..

తాజాగా నల్ల విజయ్ శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కళ్యాణానికి బంగారు చీరను నేశారు. సీతాదేవికి సమర్పించేందుకు రంగులు మార్చే సరికొత్త బంగారు చీరకు రూపకల్పన చేశారు. ఈ చీర పొడవు ఐదున్నర మీటర్లు కాగా, వెడల్పు 48 ఇంచులుగా ఉన్నది. దీని బరువు 600 గ్రాములు ఉండగా, ఈ చీరను నేయడానికి 18 రోజుల సమయం పట్టిందని తెలపారు. ఈ చీరలో బంగారు ఝరీ, వెండిఝరీతో పాటు రెడ్‌బ్లడ్ పట్టుపూలతో తయారు చేసినట్టు నల్ల విజయ్ వివరించారు.

Tags:    

Similar News