Koppula Eshwar: ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ
Koppula Eshwar: కొప్పులను ప్రశ్నించిన సింగరేణి మహిళా కార్మికులు
Koppula Eshwar: ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన సెగ
Koppula Eshwar: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రామగుండం వన్ ఇంక్లయిన్‌లో ప్రచారానికి వెళ్లిన కొప్పుల ఈశ్వర్‌ను సింగరేణి మహిళా కార్మికులు నిలదీశారు. గత ఏడాది 50 మంది మహిళలను ఎలాంటి సమాచారం లేకుండా బదిలీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా కార్మికులు. ఎన్నికలు రాగానే వస్తారని తర్వాత ఎవరూ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అధికారంలో మీరే కదా అంటూ ప్రశ్నించారు.