Rajanna Sircilla: వరద నీటిలో కొట్టుకుపోయిన సిద్ధిపేట డిపో బస్సు
* ప్రయాణికులను సురక్షితంగా రక్షించిన స్థానికులు * ఇవాళ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బస్సు
వరద నీటిలో కొట్టుకుపోయిన బస్సు (ఫైల్ ఫోటో)
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట శివారు మానేరు వాగులో నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు. కానీ వరద ఉధృతి పెరగడంతో మరుసటి రోజుకు ప్రయత్నాన్ని వాయిదా వేశారు. ఇవాళ ఉదయం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొట్టుకుపోయింది.
లింగన్నపేట సమీపంలోని మినీ బ్రిడ్జిపై నుంచి మానేరు వాగు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద ఉధృతి ఉన్నా లెక్క చేయని డ్రైవర్ బస్సును వంతెనపైకి తీసుకెళ్లి వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే, వరద ప్రవాహ ఉధృతికి బస్సు వంతెన చివరి అంచు వరకు వెళ్లి ఆగింది. స్థానికులు సాయంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు మాత్రం అక్కడే ఉండిపోయింది. ఈరోజు ఉదయం వరద ఉధృతి పెరగడంతో బస్సు కొట్టుకుపోయింది.