LockDown Effect: బీపీ, షుగర్ బాధితులకు ఇబ్బందులు..

లాక్ డౌన్ అమలు చేస్తూన్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2020-03-30 13:36 GMT
Representational Image

లాక్ డౌన్ అమలు చేస్తూన్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేషెంట్లు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో మెడికల్ షాపులలో మందులన్నీ నిండుకుంటున్నాయి. దీంతో బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు, తరచూ ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు వాడేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది పేషెంట్లు లాక్ డౌన్ సందర్భంగా మందులు సరఫరా చేస్తారో లేదో తెలియకపోవడంతో ముందుగానే మందులు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు. ఎప్పుడు కొనే దానికన్నాఎక్కువగా కొనుగోళ్లు చేసుకోవడంతో మిగతా వారికి ఆ మందులు అందుబాటులో లేవంటూ దుకాణాదారులు స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్‌ నగరంలోనే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా మందేలు లభ్యంకాకుండా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై మెడికల్ షాపుల యజమానులు స్పందిస్తూ మందుల తయారీదారుల నుంచి సరఫరా నిలిచిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్ పెరిగిపోయిందని, కానీ మందులు సరఫరా లేదని చెబుతున్నారు. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి ఇతర మందులను వినియోదారులు అత్యధిక మోతాదులో కొనుగోలో చేసారని తెలిపారు. దీంతో పది రోజుల్లోనే మెడికల్ షాపులలో ఉండే మందులన్నీ అయిపోయాయని తెలిపారు.ఈ నేపథ్యంలోనే పల్లెలో ఉండే వినియోగదారులు 3 నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేసారని తెలిపారు.


Tags:    

Similar News