SpiceJet: శంషాబాద్ - తిరుపతి స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం... సర్వీస్ రద్దు

SpiceJet: తాజాగా శంషాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ (SpiceJet) ఎస్‌జీ-2138 (SG-2138) విమానంలో టెక్నికల్‌ ఇష్యూస్‌ తలెత్తాయి.

Update: 2025-07-20 04:13 GMT

SpiceJet: శంషాబాద్ - తిరుపతి స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం: సర్వీస్ రద్దు

SpiceJet: విమాన సర్వీసుల్లో సాంకేతిక లోపాలు వరుసగా ఎదురవుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇటీవల అహ్మదాబాద్‌ ఎయిర్‌ఇండియా ఘటన ఇంకా మరిచిపోలేదో, తాజాగా శంషాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ (SpiceJet) ఎస్‌జీ-2138 (SG-2138) విమానంలో టెక్నికల్‌ ఇష్యూస్‌ తలెత్తాయి.

ఈ విమానం రన్‌వేపై ఉన్న సమయంలో పైలట్‌కి సాంకేతిక లోపం గుర్తించారు, వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ సర్వీస్‌ను రద్దు చేస్తూ చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న 54 మంది ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది.

ఈ ఘటనపై ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ, “విమానం ఎగురకముందే లోపం బయటపడటం వలన పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఇదే సమస్య తలెత్తుంటే ఏమవుతుందో!” అని అన్నారు. ప్రయాణికులు కొంత సమయం విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చినా, ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఇదే విమాన సర్వీస్‌ గత నెల 16న కూడా టెక్నికల్‌ ఇష్యూకు లోనైంది. టేకాఫ్‌కు ముందు కాలిన వాసన రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నిలిపివేసి తనిఖీలు జరిపారు. ఆ ఘటనలో ప్రయాణికులు సుమారు మూడున్నర గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉండాల్సి వచ్చింది.

Tags:    

Similar News