Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు ఎక్కువైన పక్షుల బెడద

Hyderabad Airport: నిత్యం రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో శంషాబాద్ విమానాశ్రయం ఒకటి. అయితే ఈ మధ్య ఈ విమానాశ్రాయానికి పక్షుల బెడద ఎక్కువైంది. ఇటీవల కాలంలో దాదాపు 49 సార్లు పక్షులు విమానాన్ని ఢీ కొట్టాయి. దాదాపు 11 సార్లు మే డే కాల్స్ అధికారులకు వచ్చాయి.

Update: 2025-07-18 07:43 GMT

Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు ఎక్కువైన పక్షుల బెడద

Hyderabad Airport: నిత్యం రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో శంషాబాద్ విమానాశ్రయం ఒకటి. అయితే ఈ మధ్య ఈ విమానాశ్రాయానికి పక్షుల బెడద ఎక్కువైంది. ఇటీవల కాలంలో దాదాపు 49 సార్లు పక్షులు విమానాన్ని ఢీ కొట్టాయి. దాదాపు 11 సార్లు మే డే కాల్స్ అధికారులకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

ఇటు అంతర్జాతీయ, అటు డొమెస్టిక్ విమానాల రాకపోకలతో ఎప్పుడూ శంషాబాద్ విమానాశ్రయం బిజీ బిజీగా ఉంటుంది. అయితే ఈ మధ్య పక్షులు బెడద ఎక్కువవ్వడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. సడన్‌గా విమానం ఎగిరే సమయానికి విమానంపైకి వస్తున్నాయి. దీంతో కంగారు పడుతున్న పైలట్లు వెంటనే మే డే కాల్స్ చేయడం లేదంటే కాసేపాగి బయలుదేరడం వంటివి చేస్తున్నారు.

ఈ ఏడాదిలో పక్షుల బాధ ఎక్కువైపోయింది. జనవరి నుంచి మే నెలాఖరు వరకు అంటే ఐదు నెలల వ్యవధిలో టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో విమానాలను పక్షులు 49 సార్లు ఢీకొట్టినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. అంతేకాదు ఈ నెల జనవరి నుంచి మే చివర వరకు ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీ సమయంలో ఆకాశంలోంచి నేలపైకి ఇచ్చే సంకేతం అయిన మే డే కాల్స్ దాదాపు 11 సార్లు పైలెట్లు చేసినట్లు కూడా అధికారులు తెలిపారు.

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీ కొట్టే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో 2వేలకు పైనే విమానాలను పక్షులు ఢీ కొట్టాయి. ముఖ్యంగా ఢిల్లీ, అహ్మదాబాద్ ప్రాంతంలో పక్షుల బెడద ఎక్కువగా ఉంది. ఢిల్లీ ఈ ఘటనలు ఏడాదికి 400 వరకు కేసులు నమోదవుతున్నాయి.

అయితే ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పక్షులు విమానాలను ఢీ కొట్టే ఘటనలు ఎక్కువయ్యాయి. అయితే దీన్ని కంట్రోల్ చేయడం ఎవరివల్లా కావడం లేదు. అందుకే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే విమానశ్రయం చుట్టూ జంతువులు లేదా పక్షులు లేకుండా చూస్తున్నారు. చెద్ద చెదారం విమానాశ్రయం చుట్టుపక్కల ఎక్కడా పడేయకుండా శుభ్రంగా ఉంచుతున్నారు. అదేవిధంగా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో పక్కన పటాసులు కాల్చుతున్నారు. అయినా కూడా పక్షుల బెడద ఎక్కువవుతుంది.

ఇదిలా ఉంటే ఎయిర్ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులు పెరగడానికి కారణం ఏంటన్న కోణంలో విచారణ జరుగుతుంది. అయితే కాటేదాన్, జలపల్లి ప్రాంతంలో నిబంధనలకు విరుద్దగా కొత్తగా కొన్ని పరిశ్రమలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతాల్లో కళేబరాలు, ఇతర వ్యర్ధ పదార్ధాలను పడేస్తున్నారు. దీనివల్ల పక్షులు అక్కడ రావడంతో విమానాలను ఢీ కొడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారించి, చర్యలు తీసుకోవాలని అధికారులు చూస్తున్నారు.

Tags:    

Similar News