దిశ ఘటనలో నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఇవాళ షాద్ నగర్ కోర్టులో విచారణ

Update: 2019-12-03 06:04 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం కేసులో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో షాద్ నగర్ కోర్టులో నిన్న విచారణ జరిగింది. అనంతరం విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.

నిందితులు గతంలో ఇంకా ఏమైనా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అని తేల్చేందుకు విచారణకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో కోరిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి త్వరగా శిక్ష అమలు చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిందితులకు తక్షణమే శిక్షలు ఖరారు చేయాలని, తీవ్రమైన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిందితుల తరఫున ఏ లాయర్ కూడా వాదించకూడదని బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు నిందితుల తరఫున ఎవరూ కౌంటర్ దాఖలు చేయలేదు.  

Tags:    

Similar News