తెలంగాణ ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన
* యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్
తెలంగాణ ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన
Satvick Case: తెలంగాణ ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి... యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గేటు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సాత్విక్ సూసైడ్ నోట్ బయటికొచ్చింది. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో సూసైడ్ నోట్‌లో రాశాడు. అమ్మా, నాన్న క్షమించాలని.. తాను తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. నిన్న రాత్రి నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ గదిలో సాత్విక్ ఉరివేసుకున్నాడు. సాత్విక్ మృతితో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్‌లను అరెస్ట్ చేశారు. అలాగే సాత్విక్ మృతి ఘటనపై మంత్రి సబిత విచారణకు ఆదేశించారు.