Nalgonda: నల్లగొండ జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత
Nalgonda: నల్లగొండ జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
Nalgonda: నల్లగొండ జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత
Nalgonda: నల్లగొండ జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం. ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సూర్యోదయం తర్వాతే బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.