KTR: హైదరాబాద్ కేంద్రంగా అమెజాన్ వెబ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు
KTR: అమెజాన్ ప్రకటనను సాదరంగా స్వాగతించిన ఐటీ మంత్రి కేటీఆర్
KTR: హైదరాబాద్ కేంద్రంగా అమెజాన్ వెబ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు
KTR: ప్రముఖ ఇంటర్నేషనల్ ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్ హైదరాబాద్‌లో 36వేల300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఐటీ మంత్రి కేటీరామారావు దావోస్ పర్యటనలో ఉండగా అమేజాన్ పెట్టుబడులు పెట్టే విషయమై సానుకూల సంకేతాలు జారీ చేసింది. ఇటీవల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో అమెజాన్ ప్రకటించింది. ఈమేరకు అమేజాన్ వెబ్ సర్వీస్ సెంటర్ రానున్న ఏడేళ్లలో దశలవారీగా ఈ పెట్టుబడులను వెచ్చిస్తామని పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా అమేజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అందించింది. ఈ-గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచేందుకు ఈ డేటా సెంటర్లను ఉపయోగిస్తామన్నారు. ఈ డేటా సెంటర్‌తో దేశంలోనే ప్రగతిశీల డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఐటీ మంత్రి కేటీ రామారావు అభిప్రాయం వ్యక్తంచేశారు.
దావోస్ పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ అధికారులతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొన్నారు. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎదురు చూస్తున్న పారిశ్రామిక దిగ్గజాలతోనూ తెలంగాణలో ఉన్న వనరులను, ప్రోత్సాహకాల గురించి వివరించారు. మైక్రో సాఫ్ట్ మరో 16 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తంచేసింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది.