Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మంత్రి ఉత్తమ్ సీఎం అవుతారు..
Raj Gopal Reddy: ఉత్తమ్‌కు సీఎం అయ్యే అవకాశం ఉందన్న రాజగోపాల్‌రెడ్డి
Komatireddy Raj Gopal Reddy
Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటిపారుదల శాఖ సమీక్షలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి అని సంబోధించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి మిస్ అయిందని.. ఏదో ఒకరోజు సీఎం అయ్యే అవకాశం మీకు ఉందంటూ ఉత్తమ్‌ను చూపిస్తూ మాట్లాడారు. తన నాలుక మీద పుట్టుమచ్చ ఉందని.. తాను చెప్పింది నిజం అవుతుందని అన్నారు రాజగోపాల్ రెడ్డి.