మునుగోడు ఉప ఎన్నికలను పెద్దగా పట్టించుకోని సీనియర్ కాంగ్రెస్ నేతలు

Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి.

Update: 2022-08-17 10:11 GMT

మునుగోడు ఉప ఎన్నికలను పెద్దగా పట్టించుకోని సీనియర్ కాంగ్రెస్ నేతలు

Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఇలాంటి టైమ్‎లోనూ సీనియర్లలో సీరియస్‎నెస్ లేదనేది గాంధీ భవన్ వేదికగా మరోసారి బయటపడింది. మాణిక్యం ఠాగూర్ రివ్యూలను సీనియర్లు లైట్ తీసుకుంటున్నారు. గాంధీభవన్‎లో మాణిక్యం ఠాగూర్ సమావేశానికి మధు యాష్కీ డుమ్మా కొట్టారు. ఠాగూర్ వచ్చి కూర్చున్నా కొందరు నేతలు సమావేశానికి లేటుగా వచ్చారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‎రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్‎రెడ్డి, సీతక్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి ఠాగూర్ సమావేశానికి హాజరుకాలేదు. మునుగోడు రివ్యూ టైంలోనే సీఎల్పీ బృందం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్‎లో హాట్ టాపిక్ అయింది. కరోనా కారణంగా ఠాగూర్ సమావేశానికి రేవంత్‎రెడ్డి దూరంగా ఉన్నారు. ఓవైపు అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఏఐసీసీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతుండగా సీనియర్ల వ్యవహారం హస్తం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News