తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
Telangana High Court: ఇటీవల కాలంలో గుండెపోటు కేసుల ఎక్కువ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారు వరకు గుండెపోటు వస్తోంది.
తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
Telangana High Court: ఇటీవల కాలంలో గుండెపోటు కేసుల ఎక్కువ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారు వరకు గుండెపోటు వస్తోంది. కొందరు వెంటనే ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు ఎమర్జెన్సీ చికిత్సతో బ్రతికిపోతున్నారు. ఇలా కార్డియాక్ అరెస్ట్‌తో కొందరు కూర్చున్న చోటే ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు నిద్రలో, వ్యాయామం చేస్తూ, డ్యాన్స్ చేస్తూ చనిపోయిన ఘటనలు అనేక చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణ హైకోర్టులో జరిగింది. కోర్టులో వాదిస్తూనే న్యాయవాది గుండెపోటుతో కుప్పకూలాడు.
అది గమనించిన కోర్టు సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వివరాల ప్రకారం.. పసునూరి వేణుగోపాల్ అనే సీనియర్ న్యాయవాది ఫిబ్రవరి 18న ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో లాయర్ వేణుగోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది వేణుగోపాల్‌ను హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వేణుగోపాల్ మరణించినట్టు నిర్థారించారు. వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ కోర్టులోనే గుండెపోటుతో మరణించడంతో తోటి లాయర్లు సంతాపం వ్యక్తం చేశారు.