తెలంగాణలో దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్

Lockdown: తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ దడ పుట్టిస్తోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Update: 2021-12-23 06:20 GMT

తెలంగాణలో దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్

Lockdown: తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ దడ పుట్టిస్తోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల జిల్లాలోని గూడెం గ్రామంలో లాక్‌డౌన్ విధించారు. కొద్ది రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో వారి కుటుంబ సభ్యులకు టెస్టులు చేపించగా ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన గ్రామ పంచాయతీ పాలక వర్గం లాక్‌డౌన్ విధించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు డిసెంబర్ 16న దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో టెస్టులు చేయగా నెగిటివ్ అని వచ్చింది. కానీ సొంతూరు వచ్చాక అతడిలో జలుబు లాంటి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే ఆ యువకుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం యువకుడి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కరోనా టెస్టులు చేయగా యువకుడి తల్లి, భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆంక్షలు విధించారు.

Full View


Tags:    

Similar News