Self Lockdown: కొమురం భీం జిల్లాలో కరోనా కట్టడికి సెల్ఫ్ లాక్‌డౌన్

Self Lockdown: ఇవాల్టీ నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ * ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకే షాపులు

Update: 2021-04-22 06:30 GMT

కొమురంభీం జిల్లాలో సెల్ఫ్ లొక్డౌన్ (ఫైల్ ఇమేజ్)

Self Lockdown: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో పలు గ్రామాలు స్వచ్ఛందంగా సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నాయి. కొమ్రుం భీం జిల్లా కౌటల మండల కేంద్రంలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఇవాల్టీ నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. వర్తకవ్యాపారాలు మధ్యాహ్నం ఒంటిగంటవరకే తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అందరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని తీర్మాణం చేశారు.

Tags:    

Similar News