Seethakka: సీతక్క ప్రమాణస్వీకారం చేస్తుండగా దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం
Seethakka: సీతక్క క్రేజ్‌ను చూసి షాక్ అయిన కాంగ్రెస్ పెద్దలు
Seethakka: సీతక్క ప్రమాణస్వీకారం చేస్తుండగా దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం
Seethakka: గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది. ప్రమాణస్వీకారానికి సీతక్కని పిలిచిన వెంటనే ఆమె వేదికపైకి చేరుకోగానే అభిమానులు కేరింతలతో హోరెత్తారు. ఎల్బీ స్టేడియం ప్రాంగణమంతా మోత మోగిపోయింది. ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసిన సీతక్క మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెబితే... సీతక్క మాత్రం దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు.