Secunderabad Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి నేడు బోనాలు
Secunderabad Bonalu: అమ్మవారి ప్రత్యేక హారతి నివేదనతో ప్రారంభమైన పూజలు
Secunderabad Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి నేడు బోనాలు
Secunderabad Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహింకాళి సన్నిధిలో బోనాల సందడి మొదలైంది. వేకువ జామునుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీర్వచనాలకోసం బోనాలతో బారులు తీరారు. మహంకాళి అమ్మవారి దివ్యసన్నిధిలో కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆషాఢ మాసంలో ప్రత్యేకతను సంతరించుకున్నబోనాల పండుగలో అమ్మవారిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ మహంకాళి సన్నిధిలో సర్కారు తరఫునమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బోనం సమర్పించారు.
మహంకాళి అమ్మవారి సన్నిధిలో బోనాల సందడి నెలకొంది. వేకువ జామునుంచే బోనాలు సమర్పించేందుకు మహిళలు వేలాదిగా తరలి వచ్చారు. ఎక్కడా ఎవ్వరికీ ఇబ్బందుల్లేకుండా.. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతియేటా అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవడ ఆనందంగా ఉందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.