హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్ల కలకలం.. ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్ల తయారీ
Hyderabad: అత్తాపూర్‌లో చాక్లెట్ పరిశ్రమపై దాడులు చేసిన ఎస్‌వోటీ బృందం
హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్ల కలకలం.. ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్ల తయారీ
Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్ల తయారీ కలకలం సృష్టించింది. నగరంలోని ఓ పరిశ్రమలో ప్రమాదకరమైన రసాయనాలతో తయారుచేస్తున్న చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. పరిశ్రమపై దాడులు చేసిన ఎస్‌వోటీ టీమ్స్ ముఠా గుట్టును రట్టు చేసింది. ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్లను తయారు చేయడమే కాకుండా.. వాటికి బ్రాండెడ్ స్టిక్కరింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇస్సార్ అహ్మద్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.