Basara IIIT: చీఫ్ వార్డెన్ శ్రీధర్‌ను తొలగించండి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలు..
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన ముగిసింది.
Basara IIIT: చీఫ్ వార్డెన్ శ్రీధర్‌ను తొలగించండి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలు..
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన ముగిసింది. బాసర ట్రిపుల్ ఐటీలో వసతుల లేమి, ప్యాకల్టీ కొరత.. కేర్ టేకర్ల కొరతపై కమిషన్‌కు ఏకరువు పెట్టుకున్నారు విద్యార్థులు. కమిషన్ మీటింగ్‌కు చీఫ్ వార్డెన్ శ్రీధర్ హాజరుకాకపోవడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. అలాగే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
6 వేల మంది బాలికలకు నలుగురు మాత్రమే కేర్ టేకర్లు ఉండటంపై మండిపడ్డారు. కేర్ టేకర్లను వెంటనే పెంచాలని ఆదేశించారు. విద్యార్థులకు సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడంతో... ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు స్టూడెంట్స్. ప్రభుత్వం ఫ్యాకల్టీ నియామకలాపై కసరత్తు చేస్తుందని కమిషన్‌కు తెలిపారు ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ. వీలైనంత త్వరగా ఫ్యాకల్టీ సమస్య తీర్చాలని తెలిపింది కమిషన్.