ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది.

Update: 2025-03-18 11:38 GMT

ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం ప్రవేశపెట్టారు. గ్రూపు-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్ కల్పించారు. గ్రూప్-2 లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. గ్రూప్-3 లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో, పార్టీలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. జగ్జీవన్ రామ్ కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలను అప్పగించి గౌరవించిందని సీఎం తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2004లో ఉషా మెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని సీఎం అన్నారు. ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించి, కమిషన్ నివేదికను ఏ మాత్రం మార్చకుండా ఆమోదించినట్టు తెలిపారు. 59 ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా కమిషన్ విభజించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

Tags:    

Similar News