మేడారం సమ్మక్క-సారలమ్మ పనులను పరిశీలించిన మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారుల పనులను పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్.

Update: 2019-12-19 05:53 GMT
రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారుల పనులను పరిశీలించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ నుంచి మేడారం వరకు రోడ్ల పనులను సంబంధిత జాతీయ రహదారుల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మహబూబాబాద్ లోని కంబాలపల్లి నుంచి నర్సంపేట వరకు జాతీయ రహదారుల పనులను పరిశీలించారు. వెంటనే పనులను పూర్తి చేసి రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సరైన సిబ్బంది, యంత్రాలు లేక పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని, వెంటనే సిబ్బందిని, యంత్రాలు పెంచాలన్నారు.

పనులు వేగవంతం చేసే క్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, పనుల నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పనుల నాణ్యత అద్వాన్నంగా ఉందని, జాతీయ రహదారుల కంటే ఆర్ అండ్ బి రోడ్ల నాణ్యతే బాగుందని, ఇదే తీరు కొనసాగితే ప్రజలు ఇబ్బంది పడుతారని, అలా జరగకుండా చూసుకోవాలని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం కోసం నిరంతరం రోడ్ల పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. రోడ్ వేయడంతో పాటు దాని నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు చేసేలా సంబంధిత ఏజెన్సీ కి, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. 

Tags:    

Similar News