Vikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
Vikarabad Selfie Video: వికారాబాద్ జిల్లా తాండూరులో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.
Vikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
Vikarabad Selfie Video: వికారాబాద్ జిల్లా తాండూరులో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. గత మూడు నెలలుగా తన భార్య ఆచూకీ లభించకపోవడంతో మనస్థాపం చెందిన సత్యమూర్తి అనే వ్యక్తి ఓ స్పెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీసుల వైఫల్యంతోనే తన భార్య ఆచూకీ లభించడంలేదని ఆయన ఆరోపించారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్టు స్పెల్ఫీ వీడియోలో తెలిపారు. 48 గంటల్లో భార్య అన్నపూర్ణ ఆచూకీ కనిపెట్టకపోతే, తమ శవాల లొకేషన్ షేర్ చేస్తానని సత్యమూర్తి చెప్పడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందు ఆయన ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.