భర్తతో కలిసి ధర్మసాగర్‌ పీఎస్‌కు జానకీపురం సర్పంచ్ నవ్య.. పోలీసులు సహకరించడం లేదని ఆరోపణ

Navya: మూడు రోజుల గడువుతో పోలీసుల నోటీసులు

Update: 2023-06-25 15:00 GMT

భర్తతో కలిసి ధర్మసాగర్‌ పీఎస్‌కు జానకీపురం సర్పంచ్ నవ్య.. పోలీసులు సహకరించడం లేదని ఆరోపణ

Navya: తన భర్త ప్రవీణ్‌తో కలిసి ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు జానకీపురం సర్పంచ్‌ నవ్య చేరుకుంది. 4 రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్‌ నవ్య వేధింపుల కేసు పెట్టింది. ఎమ్మెల్యే పై ఫిర్యాదు నేపథ్యంలో తగిన ఆధారాలు ఇవ్వాలంటూ మూడు రోజుల గడువుతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నోటీసుల అంశంపై మాట్లాడేందకు నవ్య.. భర్తతో కలిసి స్టేషన్‌కు చేరుకుంది. FIR నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని పోలీసులకు నవ్య చెబుతోంది. పోలీసులు తనకు సహకరించట్లేదని సర్పంచ్ నవ్య ఆరోపిస్తోంది.

Tags:    

Similar News