Hyderabad: హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నుంచి శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
ఎక్కువసేపు మెలకువతోనే ఉంటున్నట్లు తెలిపారు. అయితే బాలుడు కుటుంబ సభ్యులను గుర్తించడంలేదని..ఎవరు పలకరించినా ప్రతి స్పందన చూపించడం లేదని తెలిపారు. చికిత్స కొనసాగుతోందని..మరికొంత కాలం పట్టవచ్చని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 56రోజుల గడిచినప్పటిప్పటి బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పులేదని వైద్యులు చెబుతున్నారు. సొంతంగా గాలిపీల్చుకుంటుండంతో వెంటిలేటర్ తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే మంచానికే పరిమితమయ్యాడు. పేరు పెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడటం లేదు. నోరు విప్పి మాట్లాడటం లేదు. ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే ఇప్పటికీ లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నారు. వైద్యులు ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు చెప్పలేని పరిస్థితి. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు.
గతేడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా నటుడు అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా ఆయనను చూడటానికి ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కుటుంబంతో సహా సినిమా చూడటానికి వచ్చిన రేవతి కుటుంబం తొక్కిసలాటకు గురైంది. రేవతి సొమ్మసిల్లి పడిపోయింది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించినా లాభం లేదు. అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కు తరలించారు బాలుడి పరిస్థితి విషమించి చాలా రోజులు కోమాలోకి వెళ్లాడు. ట్రీట్ మెంట్ అనంతరం మెల్లగా కోలుకున్నాడు.