Yadadri Temple: యాదాద్రి ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్
Yadadri Temple: కొద్దిపాటి వర్షాలకే బయట పడిన నిర్మాణ లోపాలు
Yadadri Temple: యాదాద్రి ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్
Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఫ్లోరింగ్ మరోసారి కుంగింది. అత్యున్నత ప్రమాణాలతో ఆలయాన్ని పునర్నించామని అధికారులు చెబుతున్నప్పటికీ నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానకు ఫ్లోరింగ్ 10 మీటర్ల మేర కుంగాయి. ప్రధాన ఆలయంలోని దక్షిణ రాజ గోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ కుంగింది. గతంలోనూ చిన్నవానకే ఫ్లోరింగ్ కుంగడంతో.. రాతి బండలు తొలగించి రిపేర్లు చేశారు. రిపేర్లు చేసి ఏడాది కాకముందే ఫ్లోరింగ్ కుంగింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని యాదాద్రిలో లోపాలు సరి చేయాలని భక్తులు కోరుతున్నారు.