Allu Arjun: ఎన్నికల బరిలోకి ఐకాన్ స్టార్.. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్న బన్నీ.?
Allu Arjun: చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేస్తే అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని ఊహాగానాలు
Allu Arjun: ఎన్నికల బరిలోకి ఐకాన్ స్టార్.. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్న బన్నీ.?
Allu Arjun: దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు విపరీమైన క్రేజ్ ఉంది. పుష్పతో అల్లు అర్జున్ స్టార్ డమ్ పాన్ ఇండియా లెవల్‌కు చేరిపోయింది. దీంతో వరుస సినిమాలతో అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా నిలిచారు అల్లు అర్జున్. ఈ సారి తన మామ తరపున ప్రచారం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. దీంతో మామ కోసం అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రశేఖర్ రెడ్డిది తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం చింతపల్లి గ్రామం. 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ హీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు బన్నీ మామకు మద్దతుగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు చంద్రశేఖర్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పెద్దపూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన ఆఫీస్, ఫంక్షన్ హాల్ ప్రారంభించేందుకు అల్లు అర్జున్ అక్కడికి రప్పిస్తున్నారు.
10వేల మందితో సభ ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి బన్నీ మామకు కేసీఆర్ ఈ సారి టికెట్ ఇస్తారా..? ఇస్తే స్టైలిష్ స్టార్ ప్రచారంలోకి దిగితే రిజల్ట్ ఎలా ఉంటుంది.? అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ ఆసక్తికరంగా మారింది.