ప్రభుత్వ నివేదికలపై మరోసారి హైకోర్టు అసహానం.. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం

Update: 2019-11-07 06:34 GMT

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ నివేదికలపై హై కోర్టు మరోసారి అసహానం ప్రదర్శించింది. కోర్టును తప్పుదోవ పట్టించేవిధంగా గజిబిజి లెక్కలు పదాలు వాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంతవరకు ఏ బడ్జెట్ లో ఈ విధంగా చూడలేదు అంది. న్యాయమూర్తి అడిగిన ప్రతి ప్రశ్నకు నివేదిక ఆధారంగా లెక్కలు చూపిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు సమాధానం చెబుతున్నారు. తప్పుడు లెక్కలు ఇచ్చారని ఆర్టీసీ ఎండీ సునీల్ పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. కోర్టుకు సమర్పించిన నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్ కు కోర్టు ఆదేశించింది. ఆర్థిక శాఖ సమర్పించిన రెండు రిపోర్టులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పిన న్యాయస్థానం ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని హెచ్చరించింది.

ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. సమయభావం లేకపోవడంతో ఉన్న రికార్డులతో రిపోర్టు ఇచ్చానని, ఈ విషయంలో మన్నించాలని కోరారు. క్షమాపణలు కోరడం సమాధానం కాదు, వాస్తవాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.  

Tags:    

Similar News