VC Sajjanar: ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదు

VC Sajjanar: ఆర్టీసీ బస్సు డిపోలను తొలగిస్తున్నారని భూములను విక్రయిస్తున్నారని వస్తున్న వార్తలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఖండించారు.

Update: 2021-11-30 10:49 GMT

VC Sajjanar: ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదు

VC Sajjanar: ఆర్టీసీ బస్సు డిపోలను తొలగిస్తున్నారని భూములను విక్రయిస్తున్నారని వస్తున్న వార్తలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఖండించారు. ఆర్టీసీ యాజమాన్యానికి డిపోను తొలగించాలని భూములు అమ్మాలనే ఆలోచన లేదన్నారు. సంస్కరణల్లో భాగంగా నష్టాన్ని తగ్గించడానికి సిబ్బందిని కొన్ని బస్సులను వేరే చోటుకు మార్చామన్నారు. ఆర్టీసీ ఆదాయంతో పాటు ఓఆర్ కూడా భారీగా పెరిగిందని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంది అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ మెగా ర‌క్త‌దాన శిబిరాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంజీబీఎస్ స్టాళ్ల‌లో వ‌స్తువుల ధ‌ర‌పై స‌జ్జ‌నార్ ఆరా తీశారు. అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News