మేమింకా ఏపీఎస్ ఆర్టీసీలోనే ఉన్నాం.. త్వరలో అమిత్‌ షాతో భేటీ : ఆర్టీసీ జేఏసీ

Update: 2019-11-02 11:08 GMT
ఆశ్వత్థామరెడ్డి

రాష్ర్ట విభజన జరిగినా ఏపీఎస్ఆర్టీసీ విభజన జరగలేదన్నారు ఆర్టీసీ తెలంగాణ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జరగదన్నారు. ఆర్టీసీని కేంద్రం పంపకాలు చేయాల్సి ఉందన్నారు. ఇంకా తామంతా ఏపీఎస్ఆర్టీసీలోనే కొనసాగుతున్నామని చెప్పారు. సమ్మె యథాతధంగా కొనసాగుతుందని.. కార్మికులు ఎవరూ భయపడాల్సిన అసరం లేదన్నారు అశ్వధ్దామరెడ్డి.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి చర్చలు ప్రారంభించాలని ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. ఆర్టీసీ సమ్మెపై కార్యాచరణ ప్రకటించారు. రేపు అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 4వ తేదీన రాజకీయ పార్టీలు, కార్మికులు డిపోల దగ్గర నిరసన, 5న రహదారుల దిగ్భందం, 6న నిరసన దీక్షలు, 7న ప్రజా సంఘాల నిరసన, 8న ట్యాంక్ బండ్ దగ్గర నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలువనున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వధ్దామరెడ్డి తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు. 

Tags:    

Similar News