TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల మోత.. సెస్ పేరుతో టికెట్ ధరలు పెంపు

TSRTC: ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కాంబో టికెట్‌ చార్జీ రూ. 1,090 నుండి 1,350 పెంపు...

Update: 2022-03-29 03:03 GMT

TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల మోత.. సెస్ పేరుతో టికెట్ ధరలు పెంపు

TSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగింది. సెస్ పేరుతో టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ.. తాజగా బస్ పాస్ ధరలను సైతం పెంచింది. జనరల్, ఎన్జీవో బస్ పాస్ ఛార్జీలపై గరిష్టంగా ఐదు వందల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ ఒక నుంచి అమలులోకి రానున్నాయి. బస్ పాస్ ఉపయోగించే ప్రయాణికులకు అదనపు భారం తప్పదు. మరో వైపు నష్టాల పేరుతో పలు రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపి వేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఆర్టీసీ టికెట్ ధరలు ఒక్కసారిగా పెంచడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది,.

ఆర్డినరీ బస్ పాస్ ఛార్జి 950 రూపాయల నుంచి ఒక వెయ్యి 150 రూపాయలకు పెంచగా.. మెట్రో ఎక్స్ ప్రెస్ ఒక వెయ్యి 70 నుండి 13 వందలకు, మెట్రో డీలక్స్ ఒక వెయ్యి 185 నుండి ఒక వెయ్యి 450 రూపాయలకు, మెట్రో లగ్జరీ రెండు వేల నుండి 24 వందల రూపాయలకు పెంచారు. అదే విధంగా పుష్పక్ బస్ పాస్ ఛార్జీ 25 వందల నుండి మూడు వేలకు పెంచారు. పెరిగిన బస్ ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా విద్యార్ధులు బస్ పాస్ వినియోగిస్తుంటారు.

వారి తర్వాత చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు నిత్యం ఆర్టీసీ బస్ పాస్ లు వినియోగిస్తుంటారు. అలాంటి వారికి పెరిగిన నిత్యవసర సరుకులు, కరెంట్ ఛార్జీలకు తోడు బస్ ఛార్జీలు పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్డినరీ బస్ ఛార్జ్ 320 నుండి నాలుగు వందల రూపాయలకు, మెట్రో ఎక్స్ ప్రెస్ 450 రూపాయల నుండి 550 రూపాయలకు, మెట్రో డీలక్స్ 575 రూపాయల నుంచి ఏడు వందల రూపాయలకు పెంచారు.

ఎంఎంటీఎస్-ఆర్టీసీ కాంబో టికెట్ చార్జి ఒక వెయ్యి 90 రూపాయల నుంచి ఒక వెయ్యి 350 రూపాయలకు పెరిగింది. ఇప్పటికే సేఫ్టీ సెస్ పేరుతో టికెట్ పై రూపాయి పెంచిన ఆర్టీసీ చిల్లర సమస్య రాకుండా రౌండప్ కటాఫ్ పేరుతో టికెట్ ధర సిటీలో ఐదు రూపాయల వరకు పెరిగింది. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం నష్టాల్లో ఉన్నందున ఛార్జీలు పెంచడంలో తప్పు లేదని అభిప్రాయం పడుతున్నారు.   

Tags:    

Similar News