RS Praveen Kumar: 10 పథకాలతో బీఎస్‌పీ మేనిఫెస్టో విడుదల
RS Praveen Kumar: టీఎస్పీఎస్సీ పేరును శ్రీకాంతాచారి బోర్డ్ గా మారుస్తామన్న ఆర్ఎస్పీ
RS Praveen Kumar: 10 పథకాలతో బీఎస్‌పీ మేనిఫెస్టో విడుదల
RS Praveen Kumar: ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండటంతో.. బీస్పీ జోష్ పెంచింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీస్సీ మేనిఫెస్టోను ఆపార్టీ రాష్ట్ర్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. బహుజన భరోసా పేరుతో 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ప్రదర్శించారు. కాన్షీయువ సర్కార్ పేరుతో 10 లక్షల ఉద్యోగాలకు రూపకల్పన చేసినట్టు తెలిపారు. అందులో మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు కల్సిస్తూ.. సమానావకాశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు వివరించారు. చాకలిఐలమ్మ మహిళా జ్యోతి పేరుతో మహిళలకు పథకాన్ని రూపొందించినట్టు తెలిపారు.