ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: రోబోతో రెస్క్యూ ఆపరేషన్స్
SLBC Tunnel Collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: రోబోతో రెస్క్యూ ఆపరేషన్స్
SLBC Tunnel Collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మంగళవారం రోబోతో రోబోటిక్ బృందం టన్నెల్ లో సహాయక చర్యలు చేపట్టారు. యాన్వీ రోబోటిక్స్ ఆధ్వర్యంలో పరిస్థితులపై అంచనా వేయనున్నారు. మూడు రోజుల క్రితం రోబోటిక్స్ నిపుణుల బృందం టన్నెల్ లో పరిస్థితులను పరిశీలించారు. టన్నెల్ లోని పరిస్థితుల ఆధారంగా రోబోలతో రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
టన్నెల్ లో ప్రమాదం జరిగిన ప్రాంతమంతా షీర్ జోన్. ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపితే సొరంగం టన్నెల్ పైకప్పు మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో రోబో సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు భావించారు. యాన్వీ రోబోను టన్నెల్ లోకి పంపారు.
మార్చి 9న ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో టీబీఎం మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహన్ని బయటకు తీశారు. గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీని పంజాబ్ కు పంపారు. మిగిలిన ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో మంగళవారం 110 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు.
టన్నెల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్, కేడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2 పేరు పెట్టారు. డీ1 షీర్ జోన్ లో ఉంది. ఆ తర్వాత డీ 2 గా గుర్తించారు. డీ1 కు డీ 2 కు మధ్య 20 మీటర్ల దూరం ఉంటుంది. షీర్ జోన్ కావడంతో డీ1 ప్రాంతంలో రోబో సేవలను వినియోగించుకుంటున్నారు. టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న ప్రాంతంలో దుర్గంధం వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాంతంలో జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నారు.