Warangal: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటో-లారీ ఢీ.. నలుగురు మృతి
Warangal: వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా ప్రమాదం
Warangal: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటో-లారీ ఢీ.. నలుగురు మృతి
Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లంద జాతీయ రహదారిపై లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్‌తో సహా నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.