జగిత్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
Road Accident: పలువురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
జగిత్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
Road Accident: జగిత్యాల జిల్లా కిషన్‌రావుపేటలో రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు.. అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. మృతులు ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.