Road Accident: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో రోడ్డు ప్రమాదం
Road Accident: దుర్గానగర్ చౌరస్తా సమీపంలో బైక్‌ను ఢీకొట్టిన సిమెంట్ లారీ * ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి
Representational image
Road Accident: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గానగర్ చౌరస్తాలో బైక్ పై వెళ్తున్న వారిని సిమెంట్ మిక్సింగ్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి చాంద్రాయణగుట్ట నుండి మెహిదిపట్నం వైపు వెళ్తుండగా దుర్గా నగర్ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన సిమెంట్ మిక్సింగ్ లారీ ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్ మిక్సింగ్ లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.