KCR: ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

KCR: *పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం *గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై సూచనలు

Update: 2022-05-18 01:00 GMT

ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

KCR: ప్రగతి భవన్ లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ఇంకా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలలో అవినీతి పై సీఎం అధికారులకు క్లాస్ తీసుకోనున్నారా .

ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు పల్లెల్లో జరిగిన అభివృద్ధి ఏంటి.? ఇంకా ఏ విధంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.ఇప్పటికే నాలుగు విడుతలా పల్లె ప్రగతి నిర్వహించింది ప్రభుత్వం. గ్రామాల్లో విధి దీపాలు,డ్రైనేజ్, వైకుంఠ ధామాలు,నర్సరీ లు,హరితహారం,గ్రామ పంచాయతీ లలో ట్రాక్టర్స్ ద్వారా చెత్తను తరలించడం,తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసిన డంపింగ్ యార్డ్స్ ని ఏర్పాటు చేసింది. మరోసారి గ్రామాల అభివృద్ధి ఏ విధంగా జరుపాలన్న దానిపై అధికారులకు దిశ నిర్దేశం చేయనున్నారు కేసీఆర్.

పల్లె ప్రగతి లో భాగంగా మొక్కలు నాటడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచనలు చేయనున్నారు ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్స్ వద్ద జమ చేసిన చెత్త నుంచి ఎరువులు తయారు చేసుకోవడం పై సూచనలు చేయనున్నారు సీఎం కేసీఆర్. చెత్త ద్వారా ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించనున్నారు. గ్రామలలో ఇంకా ఎలాంటి అభివృద్ధి చేపట్టాలన్న దానిపై అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.అనంతరం గ్రామాల అభివృద్ధిపై దిశ నిర్దేశం చేయనున్నారు.

గ్రామ పంచాయతీ ల అభివృద్ధి తో పాటు మున్సిపాలిటీలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశ నిర్దేశం చేయనున్నారు.మున్సిపాలిటీ లో ప్రతి ఇంటికి డోర్ నెంబర్ వేసే కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయాలని సూచించనున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం వార్డు కమిటీలను వేసి వార్డు ఆఫీసర్ ని నియమించాలనే ఆలోచన లో ప్రభుత్వం ఉంది. ఇంటి పర్మిషన్ కోసం ప్రజలు వెళ్తే పర్సెంటేజ్ అడిగి అవినీతికి పాల్పడుతున్నారని సీఎం దృష్టి కి వచ్చినట్లు సమాచారం. అధికారులు అవినీతికి పాల్పడవద్దని వార్నింగ్ ఇవ్వనున్నరట. మున్సిపాలిటీల అభివృద్ధి ఆదాయ మార్గాల పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేయనున్నారు. 

Tags:    

Similar News