హాట్ హాట్ గా తెలంగాణ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో సమావేశం కానున్నారు.
హాట్ హాట్ గా తెలంగాణ రాజకీయాలు.. ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి కూడా పాల్గొనున్నారు. జనవరి 31న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే ఎనిమిది మంది మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారని ఆ పార్టీ ఎంపీ మల్లు రవి ఫిబ్రవరి 1న ప్రకటించారు. ఎమ్మెల్యేల భేటీ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసింది. ఇద్దరు మంత్రులను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యేలు సమావేశమయ్యారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ సమావేశం వెనుక మరో మంత్రి హస్తం ఉందనే ప్రచారం సాగింది. అయితే ఈ విషయాలపై స్పష్టత లేకపోయినా ఎమ్మెల్యేల సమావేశం మాత్రం వాస్తవమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షికి తమ అభిప్రాయాలను చెబుతామని ఆయన మీడియాకు చెప్పారు.
ఫిబ్రవరి 6న జరిగే ఎమ్మెల్యేల సమావేశాన్ని నాలుగు గ్రూపులుగా ఏర్పాటు చేశారు. విడతల వారీగా ఈ నాలుగు గ్రుపులతో రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను వారు తెలుసుకుంటారు. ఎమ్మెల్యేల పార్టీ నాయకత్వం ముందు ఉంచే అభిప్రాయాల గురించి చర్చించనున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే అభివృద్ది పనులు జరుగుతున్నాయనేది అసంతృప్త ఎమ్మెల్యే వాదన. ఈ విషయాలపై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను చెప్పనున్నారు.