Revanth Reddy: సిట్ ముందు హాజరుకానున్న రేవంత్‌రెడ్డి
Revanth Reddy: ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని సిట్ నోటీసులు
Revanth Reddy: సిట్ ముందు హాజరుకానున్న రేవంత్‌రెడ్డి
Revanth Reddy: పేపర్ లీక్ కేసులో ఇవాళ సిట్ ముందు హాజరుకానున్న టీపీసీసీ రేవంత్‌రెడ్డి. పేపర్ లీక్ కేసులో పలు ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒకే మండలంలో వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయన్నారు. లీకేజ్‌లో కేటీఆర్ పీఏ హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ దగ్గర ఉన్న ఆధారాలు చూపాలని సిట్ నోటీసులు పంపింది. ఆయన ఇంటికి వెళ్లి ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులిచ్చింది.
ఇక రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో సిట్ ఆఫీస్ ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ రాకుండా నిర్బంధిస్తున్నారు. ఇప్పటికే షబ్బీర్ అలీ, మల్లు రవి, వీహెచ్ లాంటి సీనియర్ లీడర్లను హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.