Revanth Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ లో పాల్గొననున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy: బొమ్రాస్ పేట్, దుద్యాల్, కొత్తపల్లి.. కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ లో పాల్గొననున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11గంటలకు టీపీపీసీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్ పేట్, దుద్యాల్, కొత్తపల్లి కార్నర్ మీటింగ్స్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం కుత్బుల్లాపూర్ బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.