ఈ 13 నెలలు స్త్రీల ఉచిత ప్రయాణం కోసం TGSRTC కి ప్రభుత్వం చెల్లించిన మొత్తం ఎంతంటే...
Revanth Reddy launches 4 new schemes: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మరో నాలుగు కొత్త పథకాలను ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు కొత్త రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియను రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... "స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గానికి జరగాల్సినంత న్యాయం జరగలేదని అన్నారు. అందుకే కొడంగల్ నియోజకవర్గం ప్రజలు ఈ కొడంగల్ బిడ్డను మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే, సోనియా గాంధీ తనను ముఖ్యమంత్రిగా నియమించారు" అని అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని కొత్త పథకాలను ప్రారంభించారు. అనంతరం సభకు హాజరైన వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
భూమికి, విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో.... రైతుకు, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే బలమైన అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు దివంగత సీఎం డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకే ఒక్క సంతకంతో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అలాగే ఆనాడు దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రైతులకు రుణమాఫీ చేశారన్నారు. గత కాంగ్రెస్ పాలకులను ఆదర్శంగా తీసుకునే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ నేతలు రైతుల వద్దకు ధీమాగా వెళ్లగలుగుతున్నామని అన్నారు.
రాష్ట్రం నలుమూలలా దాదాపు 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 13 నెలలు ఉచిత ప్రయాణం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం తెలంగాణ ఆర్టీసీకి ప్రభుత్వం రూ.4000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు.