
Rythu Bharosa: రైతుభరోసా పథకం కింద 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,126.54 కోట్లు జమ చేసినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూడో విడత...
Rythu Bharosa: రైతుభరోసా పథకం కింద 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,126.54 కోట్లు జమ చేసినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూడో విడత నిధులు త్వరలో విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ పథకం ప్రారంభమైంది. మొదటి విడత నిధులు జనవరి 27న విడుదలయ్యాయి. రెండో విడత నిధులు బుధవారం విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రెండో విడత కింద మిగిలిన రైతులకు నిధులు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఖాతాల్లో నిధులను జమ చేశారు.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ఆధారంగా చేసుకుని జిల్లాల వారీగా చూసినట్లయితే నల్లగొండ 1.55లక్షల మంది, సిద్ధిపేట 1.20లక్షల మంది, మెదక్ 1.15 లక్షల మంది, సంగారెడ్డి 1.15 లక్షల మంది, కామారెడ్డి 1.09లక్షల మంది, ఖమ్మం 1.04 లక్షల మంది రైతులకు నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు రూ. 1,126.54 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు నిధుల విడుదల అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ లక్ష్యం అన్నారు. మూడో విడత నిధులు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రైతు భరోసా స్కీము అమలులో భాగంగా జనవరి 27నుంచి బుధవారం వరకు మొత్తం 21,45,330 మంది రైతుల ఖాతాల్లో రూ. 1,126.54కోట్లు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులకు హామీ ఇచ్చినట్లు నిధులను నిర్ణీత కాలవ్యవధిలో అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని మిగిలిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే రైతుబంధు పథకం కింద రూ. 7,625 కోట్లు, రుణమాఫీకి రూ. 20, 616.89 కోట్లు, రైతు బీమా కోసం రూ. 3,000కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే సన్నధాన్యానికి బోనస్ కింద రూ. 500 చెల్లించామని..దీనికి రూ. 1,154కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ యాసంగి సీజన్ కు కూడా బోనస్ అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణలో పత్తి పూర్తిగా సేకరించేందుకు మరింత గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కోరారు. బుధవారం కేంద్రానికి లేఖ రాస్తూ పసుపు, మిరప పంటలకు మద్ధతు ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్నప్తి చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




