Bandi Sanjay: రామచంద్రరావును వెంటనే విడుదల చేయాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-03-23 07:46 GMT

Bandi Sanjay: రామచంద్రరావును వెంటనే విడుదల చేయాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఇచ్చిన హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు!

ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామచంద్రరావును, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని బండి సంజయ్ అభివర్ణించారు.

తక్షణమే రామచంద్రరావు సహా కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్నా, ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేవలం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారే తప్ప, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు.

అడుగడుగునా నిలదీస్తాం..

ఓట్ల కోసం, అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు పూర్తిగా అమలయ్యే వరకు బీజేపీ విశ్రమించదని, కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. "ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News